తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్‌లో ఈ ఏడాది 100 శాతం సిలబస్‌తో పరీక్షలు - ఎగ్జామ్స్​ పై ఇంటర్​బోర్డు నిర్ణయం

inter
inter

By

Published : Oct 14, 2022, 5:02 PM IST

Updated : Oct 14, 2022, 7:40 PM IST

17:00 October 14

ఇంటర్‌లో ఈ ఏడాది 100 శాతం సిలబస్‌తో పరీక్షలు

Inter Board: ఇంటర్మీడియట్​లో ఈ ఏడాది పూర్తి సిలబస్​తో పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. కొవిడ్ కారణంగా తరగతులు సరిగా జరగకపోవడంతో గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్​తోనే పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం జూన్15 నుంచే తరగతులు జరుగుతున్నందున.. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు వందశాతం సిలబస్​తోనే పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. సిలబస్, నమూనా ప్రశ్నపత్రాలు ఇంటర్మీడియట్ వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయని నవీన్ మిత్తల్ చెప్పారు.

ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయిందని నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. 5,556 ఎంటెక్ సీట్లలో మొదటి విడతలో 2,522 సీట్లు భర్తీ చేసినట్టు పేర్కొన్నారు. 3,106 ఎంఫార్మసీ సీట్లలో మొదటి విడతలో 2,163 సీట్లు భర్తీ చేశామన్నారు. 153 ఎంఆర్క్ సీట్లలో మొదటి విడతలో 46 సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. ఈనెల 19 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని.. ఈనెల 24 నుంచి ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తరగతులు నిర్వహిస్తామని నవీన్‌ మిత్తల్‌ వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 14, 2022, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details