తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్​రోకో కేసులో నాంపల్లి కోర్టుకు మాజీ స్పీకర్, ఎమ్మెల్యే​

2011లో జరిగిన రైల్​రోకో కేసులో మాజీ స్పీకర్​ మధుసూదనాచారి, ఎమ్మెల్యే వినయభాస్కర్​ నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు మరో 18మంది కూడా న్యాయస్థానానికి వచ్చారు. చెన్నై వెళ్లాల్సిన రైలును దారి మళ్లించి... 12 గంటలు నిలిపేయడం వల్ల వినయభాస్కర్​పై హైజాక్​ కేసు నమోదు చేసి ఏ1 నిందితుడిగా చేర్చారు.

నాంపల్లి కోర్టుకు మాజీ స్పీకర్​

By

Published : Jul 24, 2019, 11:50 AM IST

Updated : Jul 24, 2019, 1:46 PM IST

తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేసిన రైల్​రోకోలకు సంబంధించిన కేసుల్లో మాజీ స్పీకర్​ మధుసూదనాచారి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్​ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. వీరితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న 18 మంది కూడా న్యాయస్థానానికి వచ్చారు. 2011 ఏప్రిల్​ 14న రైళ్ల దారి మళ్లింపు కేసుల్లో ఎమ్మెల్యేతో పాటు మరో 18 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. చెన్నై వెళ్లాల్సిన రైలును దారి మళ్లించి 12 గంటలు నిలిపేయడం వల్ల పోలీసులు రైలు హైజాక్​ కేసు పెట్టారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఎమ్మెల్యే వినయభాస్కర్​ను చేర్చారు. అదే సంవత్సరంలో జరిగిన మరో రైల్​రోకో కేసులో స్పీకర్​ మధుసూదనాచారి సహా మరో తొమ్మిది మంది న్యాయస్థానంలో హాజరయ్యారు.

3 గంటలకు వాయిదా

కేసును విచారణ చేపట్టిన నాంపల్లి న్యాయస్థానం విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. నిందితులు మధ్యాహ్నం హాజరుకావాలని ఆదేశించింది.

రైల్​రోకో కేసులో నాంపల్లి కోర్టుకు మాజీ స్పీకర్, ఎమ్మెల్యే​

ఇదీ చూడండి : జలకళ సంతరించుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు జలాశయాలు

Last Updated : Jul 24, 2019, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details