సాక్షాత్తూ ఏపీ సచివాలయంలోనే దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి తీవ్ర అవమానం జరిగింది. రాష్ట్రంలో ఆయన అధికారిక పర్యటనకు సంబంధించిన ఓ చిత్రాన్ని అధికారులు ఫొటో ఫ్రేముగా చేయించారు. ప్రస్తుతం దాన్ని సచివాలయంలోని నాలుగో బ్లాక్లో చెత్తలో పేడేశారు.
సచివాలయంలో దారుణం.. చెత్తలో మాజీ రాష్ట్రపతి చిత్రపటం - ex president pranab mukherjee photo found in dustbin
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి తీవ్ర అవమానం జరిగింది. అది జరిగింది ఎక్కడో ప్రైవేటు ఆఫీసో.. పార్టీ కార్యాలయంలో కాదు సాక్షాత్తూ ఏపీ సచివాలయంలోనే..! దివగంత మాజీ రాష్ట్రపతి ప్రణణ్ ముఖర్జీ చిత్రపటాన్ని చెత్తబుట్టలో వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా చేయటంపై సచివాలయ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ రాష్ట్రపతి చిత్రపటానికి అవమానం.. చెత్తలో పడేశారు
గతంలో ఆయన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకి విశాఖ వచ్చిన సమయంలో ఆయన్ను విమానాశ్రయంలో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రులు , నౌకాదళ అధికారులు ఆహ్వానిస్తున్న సమయంలో తీసిన చిత్రాన్ని సచివాలయంలో ఉంచారు. ప్రభుత్వం మారటంతో ప్రస్తుతం ఆ చిత్రపటం చెత్తలోకి చేరింది. ఆ ఫొటోను గోడలకు తగిలించకపోయినా... కనీసం స్టోర్ లో అయినా భద్రపరచకుండా చెత్తలో పారవేయటంపై సచివాలయ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:న్యూ ఇయర్ గిఫ్ట్: బార్లు, క్లబ్బులకు అర్ధరాత్రి వరకు అనుమతి