తెలంగాణ

telangana

ETV Bharat / state

PONNALA: 'ఆంధ్రా వాళ్లు జీవోలు ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు' - telangana varthalu

ఆంధ్రా వాళ్లు చేసిన నీటి దోపిడీపై గతంలో గొంతెత్తి మాట్లాడకపోవడంపై ఆంతర్యమేమిటని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రా వాళ్లు జీవోలు ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదంటూ ఆయన ప్రశ్నించారు. 9 నెలలుగా నిద్రపోయి ఇప్పుడా మాట్లాడేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఆంధ్రా వాళ్లు జీవోలు ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు'
'ఆంధ్రా వాళ్లు జీవోలు ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు'

By

Published : Jun 23, 2021, 7:59 PM IST

ఆంధ్ర వాళ్ల నీటి దోపిడి గురించి తాను ముందే చెప్పానని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. తాను మాట్లాడిన విషయాలపై కేబినెట్​లో చర్చించినట్లు అన్ని పత్రికల్లో వచ్చిందన్నారు. ఆంధ్రతో నీటి విషయంలో ఎలాంటి బేషజాలు లేవని సీఎం కేసీఆర్​ అసెంబ్లీలోనే అన్నారని... ఇవాళ ఆంధ్ర వాళ్లు నీళ్లు దోపిడీ చేస్తున్నట్లు మంత్రులు మాట్లాడుతున్నారని వివరించారు. 9నెలలుగా నిద్రపోయి ఇప్పుడా మాట్లాడేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రా వాళ్లు జీవోలు ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదంటూ పొన్నాల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు ఏపీవి అక్రమ ప్రాజెక్టులు అంటున్నారని మండిపడ్డారు. గతంలో ఈ అంశాలపై గొంతెత్తి మాట్లాకపోవడంలో ఆంతర్యమేమిటన్నారు. అఖిలపక్షం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. కేంద్ర జల శాఖతో పాటు పెద్దలనందరినీ కలిసి ఆంధ్రావాళ్ల జలదోపిడీ గురించి ఫిర్యాదు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పాలమూరు-రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టులు పూర్తయ్యాయా అంటూ ప్రశ్నించారు. ఎస్​ఎల్​బీసీ టన్నెల్​కు ప్రభుత్వం ఈ ఏడేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.

ఆంతర్యమేమిటి?..

ఆంధ్రా నీళ్ల దోపిడీ గురించి మేం మాట్లాడి ఎక్స్​ప్రెస్​ చేశాం. మేం మాట్లాడిన ఇన్ని రోజుల తర్వాత కేబినెట్​లో సుదీర్ఘంగా చర్చించారంట. నీళ్ల సెంటిమెంట్​తో ప్రజలను మోసం చేయాలనే వాస్తవాలను గుర్తించాలని నేను కోరుతున్నా. బేసిన్​లు, బేషజాలు లేవు... అందరం కలిసి పంచుకుందాం అని కేసీఆర్​ అసెంబ్లీలో అన్నడు. మేం ఇవన్నీ బయటపెట్టిన తర్వాత ఆంధ్రోళ్లు దోచుకుంటున్నరని మాట్లాడుతున్నడు. ఆంధ్ర పాలకులు జీవోలు ఇచ్చిన 9 నెలల తర్వాత స్పందించినవు... ఇందులో ఆంతర్యమేంటి? -పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్​ నేత

PONNALA: 'ఆంధ్రా వాళ్లు జీవోలు ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు'

ఇదీ చదవండి: Bhatti: ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఏడాది క్రితమే హెచ్చరించాం..

ABOUT THE AUTHOR

...view details