లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లల్లోనూ ఉండాలంటూ ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ శంకరరావు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు... బయటకు రావద్దని హితవు పలికారు. తన సతీమణి స్వర్ణలత హెయిర్ కట్ చేసిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ పలు సూచనలు చేశారు. అందరూ లాక్డౌన్ పాటించాలని సూచించారు. కొందరు దూరాన్ని విస్మరిస్తున్నారని.. అలా చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని శంకరరావు హెచ్చరించారు.
భార్యతో హెయిర్ కట్ చేయించుకున్న మాజీ ఎంపీ - కరోనా ఎఫెక్ట్ న్యూస్
కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరూ.. తమ ప్రతిభను చాటుకున్నారు. మరికొందరు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి చెందిన మాజీ ఎంపీ తన భార్యతో హెయిర్ కట్ చేయించుకుని ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
![భార్యతో హెయిర్ కట్ చేయించుకున్న మాజీ ఎంపీ ex-mp-wife-hair-cutting-at-home](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6717968-229-6717968-1586372049255.jpg)
భార్యతో హెయిర్ కట్ చేయించుకున్న మాజీ ఎంపీ