కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచుతున్నారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అప్పుడు వృథా ఖర్చులు చేసి... ఇప్పుడు కరోనా ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెప్పడం సరికాదని విమర్శించారు. ఇటు రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ విపత్కర పరిస్థితులు వస్తాయని ఆరు నెలల నుంచి భాజపా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు.
"కమీషన్ల కోసమే కాళేశ్వరం బడ్జెట్ పెంచుతున్నారు" - hyderabad latest updates
కరోనా సమయంలో బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ సరిగా వాడుకోలేదని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అప్పుడు వృథా ఖర్చులు చేసి... ఇప్పుడు కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి బాగలేదు అనడం సరికాదని విమర్శించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం బడ్జెట్‌ను పెంచుతున్నారని ఆరోపించారు.
!["కమీషన్ల కోసమే కాళేశ్వరం బడ్జెట్ పెంచుతున్నారు" ex-mp-vivek-venkataswamy-fire-on-cm-kcr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9475988-475-9475988-1604828363965.jpg)
"కమీషన్ల కోసమే కాళేశ్వరం బడ్జెట్ పెంచుతున్నారు"
బడ్జెట్‌ను సరిగా వాడుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే బడ్జెట్‌ను సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
ఇదీ చదవండి:వరద సాయంపై ప్రధానికి లేఖరాసినా స్పందించలేదు: కేటీఆర్