తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొడుకును సీఎం చేయడానికే హరీశ్ ​గొంతుకోశారు' - మాజీ ఎంపీ

భాజపాలో చేరడం పట్ల తన అభిమానులంతా హర్షం వ్యక్తం చేశారని మాజీ ఎంపీ వివేక్​ అన్నారు. తాను తీసుకున్న నిర్ణయం సరైందేనని అందరూ మెచ్చుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​పై వివేక్​ విమర్శలు గుప్పించారు.

మాజీ ఎంపీ వివేక్​ సమావేశం

By

Published : Aug 12, 2019, 5:41 PM IST

ప్రజాస్వామిక తెలంగాణను కల్వకుంట్ల తెలంగాణగా కేసీఆర్​ మార్చేశారని మాజీ ఎంపీ వివేక్​ ఆరోపించారు. భాజపాలో చేరికపై తన నిర్ణయం సరైనదేనని అంతా సమర్ధించారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్​ కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారన్నారు. కేటీఆర్​ను ముఖ్యమంత్రిని చేయడానికే హరీశ్​రావు గొంతుకోశారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​పై మాజీ ఎంపీ వివేక్​ విమర్శలు
ఇదీ చూడండి: తుగ్లక్​ తరహాలో కేసీఆర్​ పాలన: వివేక్​

ABOUT THE AUTHOR

...view details