హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే... సౌకర్యాలు కల్పించాలన్న సోయి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేకపోవడం సిగ్గుచేటని భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఫాంహౌజుల్లో కూర్చోని, హార్టికల్చర్‌పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
'భాగ్యనగరాన్ని డల్లాస్ చేస్తానని ఇపుడా ఊసేలేదు' - భాజపా నేత వివేక్ వెంకటస్వామి తాజా వార్తలు
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా నేత వివేక్ వెంకటస్వామి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కేసీఆర్... తుగ్లక్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు.
!['భాగ్యనగరాన్ని డల్లాస్ చేస్తానని ఇపుడా ఊసేలేదు' 'భాగ్యనగరాన్ని డల్లాస్ చేస్తానని ఇపుడా ఊసేలేదు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9198273-925-9198273-1602847738381.jpg)
'భాగ్యనగరాన్ని డల్లాస్ చేస్తానని ఇపుడా ఊసేలేదు'
భాగ్యనగరాన్ని డల్లాస్ చేస్తానన్న కేసీఆర్... ఆరేళ్లైన ఆ ఊసేలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్... తుగ్లక్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సచివాలయం బదులు మంచి డ్రైనేజీ విధానం తీసుకొస్తే హైదరాబాద్ ప్రజలకు ఈ కష్టాలు తప్పేవని హితవు పలికారు.
ఇవీ చూడండి: యజమాని కుమారుడి చేతిలో కిరాతకానికి గురైన బాలిక మృతి
Last Updated : Oct 16, 2020, 6:13 PM IST