తెలంగాణ

telangana

ETV Bharat / state

'సహ చట్టాన్ని రద్దు చేసే దిశగా ఎన్డీఏ చర్యలు'

మోదీ సర్కారు స‌మాచార హ‌క్కు చ‌ట్టాన్ని ర‌ద్దు చేసే కుట్ర చేస్తోందని కాంగ్రెస్​ మాజీ ఎంపీ  పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. చ‌ట్టాన్ని ర‌ద్దు చేసే దిశ‌గా ఎన్డీయే ప్రభుత్వం పావులు క‌దుపుతోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

'సహ చట్టానికి రద్దు చేసే దిశగా ఎన్డీఏ చర్యలు'

By

Published : Jul 23, 2019, 10:31 PM IST

యుపీఏ సర్కారు తెచ్చిన సమాచారహక్కు చట్టాన్ని అటకెక్కించే దిశగా భాజపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్​ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ ఆరోపించారు. ఈ చ‌ట్టం వ‌ల్ల ప్రజ‌ల‌కు పార‌ద‌ర్శక పాల‌న అందించే అవ‌కాశాలున్నాయ‌ని, పాల‌కుల్లో జ‌వాబుదారి త‌నం పెరుగుతుంద‌ని వివరించారు. ఈ చ‌ట్టంతోనే న‌రేంద్రమోదీ, స్మృతి ఇరానీ లాంటి నేత‌ల విద్యార్హత‌ల గురించి ప్రజ‌లు తెలుసుకున్నార‌న్నారు. పాలనలో లుసుగులు బ‌య‌ట‌ప‌డతాయ‌నే భ‌యంతోనే మోడీ ప్రభుత్వం ఈ చట్టం నిర్వీర్యానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశంలో మేధావులు, విద్యావంతులు, ప్రజాస్వామిక వాదులు వెంట‌నే మోదీ దుందుడుకు చ‌ర్యల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌న్నారు.

'సహ చట్టానికి రద్దు చేసే దిశగా ఎన్డీఏ చర్యలు'

ABOUT THE AUTHOR

...view details