తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల కోసం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి కొత్త ఆలోచన

రైతుల కోసం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి కొత్త ఆలోచన చేశారు. కేవలం 500 రూపాయ‌ల ఖ‌ర్చుతో ఆర‌బోసిన లేదా గోదాముల బ‌య‌ట ఎండ‌బెట్టిన ధాన్యం వ‌ర్షం నుంచి కాపాడుకోవ్చని ప్రయోగాత్మకంగా ప్రదర్శించి చూపారు.

ex mp konda Visweswarreddy Paddy  protect Innovation
ex mp konda Visweswarreddy Paddy protect Innovation

By

Published : May 19, 2021, 9:16 PM IST

ఈ ఏడాది ధాన్యం గణనీయమైన దిగుబడి వచ్చింది. కొవిడ్ నేపథ్యంలో కొన్ని ప్రతికూల పరిస్థితుల నుంచి సరిగా ధాన్యం కొనుగోళ్లు సాగడంలేదు. ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్​ సీజన్​కు సంబంధించి ఇటీవ‌ల ప‌డుతున్న అకాల వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గోదాముల వ‌ద్ద ధాన్యం త‌డిసి ముద్దైపోతుంది. ఈ త‌డిచిన ధాన్యం కొనేందుకు పౌరసరఫరాల సంస్థ, రైస్ మిల్లర్లు ఆస‌క్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో వ‌ర్షాల‌కు ధాన్యం త‌డిచిపోకుండా ఉండేందుకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓ కొత్త ఆలోచన చేశారు.

500 రూపాయలతో..

ఆరుగాలం క‌ష్టప‌డి ప‌ండించిన ధాన్యం... వాన‌లకు త‌డిచిపోతుంటే రైతులు పడుతున్న బాధ‌లు వ‌ర్ణణాతీతంపై స్పందించారు. తరచూ కొత్త ప్రయోగాలు, ప్రజ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే నూత‌న ఆవిష్కర‌ణలు చేప‌ట్టే విశ్వేశ్వర్‌రెడ్డి... కేవలం 500 రూపాయ‌ల ఖ‌ర్చుతో ఆర‌బోసిన లేదా గోదాముల బ‌య‌ట ఎండ‌బెట్టిన ధాన్యం వ‌ర్షం నుంచి కాపాడుకోవ్చని ప్రయోగాత్మకంగా ప్రదర్శించి చూపారు.

ధాన్యం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు

ఈ టెక్నాలజీ... ప్రస్తుతం అకాల వ‌ర్షాల‌తో ఇబ్బందులు ప‌డుతున్న రైతుల‌కు ఎంతోగానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అతి తక్కువ ఖర్చుతో అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకోవడానికి రైతుల కోసం తాము ఈ ఉపాయం చేశామని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. కల్లంలో వంద క్వింటాళ్ల ధాన్యం నిల్వకు దాదాపు 500 రూపాయల ప్లాస్టిక్ కవర్ (ష్రింక్ వ్రాప్) అవసరమవుతుందని చెప్పారు. కల్లంలో నేలపై పరచడానికి తాటి పత్రులు కనీసం నాలుగు అవుతాయి... ఆ ఖర్చు 2000 రూపాయల చొప్పున మొత్తం ఖర్చు 8000 రూపాయలు అవుతాయని తెలిపారు. అదే రాతిబండపై అయితే తాటి ఆకులు పరచాల్సిన అవసరం పెద్దగా ఏమీ ఉండదని అన్నారు. తక్కుత ఖర్చులో సులభంగా రైతు సొంతంగా ఈ ష్రింక్ వ్రాప్ ఏర్పాటు చేసుకుంటే అకాల వర్షాలు, ఎలుకల బారి నుంచి ధాన్యం జాగ్రత్తగా కాపాడుకోవచ్చని... మంచి రేటు వచ్చినప్పుడు పంట అమ్ముకుని కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details