Konda Vishweshwar Reddy On 111 Go: జీవో 111 రద్దు చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్ పేరుపై 1000 కొబ్బరికాయలు కొడతానని మాజీ ఎంపీ కొండా.. మార్చి 15న ట్వీట్ చేశారు. తాను తెరాసలో చేరిన మొదట్లో 2013లోనే జీవో 111 రద్దు చేస్తానని కేసీఆర్ ప్రకటించారని.. ఇప్పటికీ ఆ మాట నెరవేరలేదని గుర్తు చేశారు. తాను పార్టీ నుంచి తప్పుకోవడానికి ఇది కూడా ఓ కారణమేనని చెప్పుకొచ్చారు. బుధవారం కేబినెట్ భేటీ అనంతరం ఆ జీవోను రద్దు చేస్తానని కేసీఆర్ చెప్పగా.. హైదరాబాద్లోని కనకమామిడి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి 100 కొబ్బరికాయలు కొట్టారు. జీవో పూర్తిగా రద్దయి జీవో 222 అమల్లోకి వస్తే మిగిలిన 900 కొడతానని పేర్కొన్నారు.
తక్కువ ధరకే భూములు అమ్ముకున్న రైతులకు పరిహారం ఇప్పించాలని.. ఇళ్లు కోల్పోయిన వారికి పున్నర్నిర్మించి ఇవ్వడంతో పాటు రైతులకు నష్టం వాటిల్లకుండా గ్రీన్ జోన్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని ట్విటర్ వేదికగా మాజీ ఎంపీ కొండా డిమాండ్ చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్... కేబినేట్ భేటీ అనంతరం నిర్వహించిన సమావేశంలో 111 జీవో ఎత్తివేతతో పాటుగా పలు అంశాలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.