తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈసారి బతుకమ్మ పండుగ అక్టోబరు 16 నుంచి 24 వరకు: కవిత

బతుకమ్మ పండగ జరుపుకునే తేదీలపై ప్రముఖ సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులతో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చర్చించారు. ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్​ 16 నుంచి 24 తేదీ వరకు జరుపుకోవాలని సూచించారు.

ex mp kavitha on bathukamma festival
అక్టోబరు 16న బతుకమ్మ పండుగ: మాజీ ఎంపీ కవిత

By

Published : Sep 14, 2020, 8:36 PM IST

ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్​ 16 నుంచి 24 తేదీ వరకు జరుపుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు. బతుకమ్మ పండగ జరుపుకునే తేదీలపై ప్రముఖ సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులతో చర్చించారు.

అధిక ఆశ్వీయుజ మాసం కారణంగా శ్రీ శార్వరి నామ సంవత్సరంలో వచ్చే బతుకమ్మ పండుగ తేదీలపై ఉన్న అస్పష్టతలను తొలగించేందుకు గానూ... పండితులు మాజీ ఎంపీ కవితను కలిసి పండుగ తేదీలపై మాట్లాడారు. అంతకంటే ముందు తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో 32 మంది సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులు, పండుగ తేదీలపై ఆన్​లైన్​ సమావేశం నిర్వహించారు.

ఈ సంవత్సరం అధిక మాసాన్ని పరిగణలోకి తీసుకని, ప్రతి సంవత్సరం లాగ భాద్రపద మాసంలో కాకుండా, అశ్వయుజ మాసంలో (అక్టోబర్) 16న బతుకమ్మను ప్రారంభించి, తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కవిత తెలిపారు. దీంతో ‘తెలంగాణ విద్వత్సభ’ సలహా మేరకు అక్టోబర్ 16న బతుకమ్మ పండుగను ప్రారంభించి.. అక్టోబర్ 24న వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ కవిత చెప్పారు.

ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని, శాస్త్ర ప్రకారం ఇందులో ఎలాంటి తప్పు లేదని వేద పండితులు తెలిపారని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:-కరోనా కాలంలో సరికొత్తగా పార్లమెంటు సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details