కొవిడ్ నిబంధనలను పాటిస్తూ దాదాపు 3 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న మాంగళ్య షోరూం నిర్వాహకులను మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్ అమీర్‌పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కవితతో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పాల్గొన్నారు.
మన్నిక, నాణ్యతతో ఉత్పత్తులను అందిస్తే ప్రజలు ఆదరిస్తారని కవిత.. నిర్వాహకులకు గుర్తు చేశారు. వరంగల్‌లో తొలి షోరూమ్‌ను ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా కొద్ది కాలంలోనే 9 షోరూమ్‌లు ప్రారంభించడం అభినందనీయమన్నారు. మరిన్ని షోరూంలను ప్రారంభించి ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలని ఆమె కోరారు.