తెలంగాణ

telangana

ETV Bharat / state

వలసకూలీలను స్వరాష్ట్రానికి తీసుకురావాలి: రాములు నాయక్​ - corona virus

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ ప్రభుత్వాన్ని కోరారు. మే 7న లాక్​డౌన్​ ముగిసిన అనంతరం ప్రత్యేక వాహనాల్లో వారిని సొంత గ్రామాలకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

ex mlc ramulu naik spoke on  telangana government
వలసకూలీలను స్వరాష్ట్రానికి తీసుకురావాలి: రాములు నాయక్​

By

Published : Apr 29, 2020, 5:55 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను స్వరాష్ట్రానికి తీసుకురావాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో వారి ఓట్లతో గద్దెనెక్కిన నాయకులు... ఇప్పుడు కష్టాల్లో ఉన్నవారిని విస్మరించడం సరికాదన్నారు. ఏపీకి చెందిన మత్యకారులు గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకున్న నేపథ్యంలో... గుజరాత్ ప్రభుత్వానికి ఏపీ ముఖ్యమంత్రి లేఖ రాసి వారిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.

మే 7న లాక్ డౌన్ ముగిసిన అనంతరం ప్రభుత్వమే వారిని ప్రత్యేక వాహనంలో వారివారి గ్రామాలకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ విపత్కర సమయంలో వలస కూలీలకు చేయూత కోసం వారి అకౌంట్లలో 10 వేలు డిపాజిట్ చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయనున్నట్లు రాములు నాయక్ తెలిపారు.

ఇవీ చూడండి: న్యాయస్థానాలకు వేసవి సెలవులు రద్దు

ABOUT THE AUTHOR

...view details