తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కాన్వాయ్‌కి అడ్డుపడ్డది అతడే: రాములు నాయక్​ - Telangana congress party latest news

తెలంగాణ అన్నింటిలో నంబర్ వన్ అని చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధనిక రాష్ట్రాన్ని బికారి రాష్ట్రంగా చేశారని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్​ నేత రాములు నాయక్‌ ఆరోపించారు. ప్రజలను చంపడం, ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వక పోవడంలో నంబర్ వన్ రాష్ట్రమా అని నిలదీశారు.

Hyderabad latest news
Hyderabad latest news

By

Published : Jun 3, 2020, 8:51 PM IST

తెరాసకి ఎన్‌జీవో సంఘాలు అనుబంధంగా మారాయని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్​ నేత రాములు నాయక్‌ ధ్వజమెత్తారు. చాలా కాలంగా రెండు పడక గదుల ఇంటి కోసం పోరాటం చేస్తున్న టోలిచౌకికి చెందిన మైనారిటీ వ్యక్తినే సీఎం కాన్వాయ్‌కి అడ్డుపడ్డారని ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లనే ఆ వ్యక్తి కాన్వాయ్‌ వద్దకు వెళ్లారన్నారు. అక్రమంగా అరెస్టు చేసి మూడు నెలలు జైలుకు పంపాలని పోలీసులు చూశారని... తాను, హనుమంతరావు ఇద్దరం పోలీసు స్టేషన్‌ వెళ్లి గట్టిగా ప్రశ్నించడం వల్లనే పోలీసులు వెనక్కి తగ్గారన్నారు. ప్రమాదవ శాత్తు మృతి చెందిన సింగరేణి కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు గురువారం రామగుండం వెళ్లనున్నట్లు రాములు నాయక్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details