అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఇంటిని సైతం తెరాస పార్టీ కార్యాలయం కోసం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీని కేసీఆర్ విస్మరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 8వ వర్ధంతి సందర్భంగా ఆదర్శ్ నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కార్మికులు ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
కేసీఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీని మరిచారు : మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్
తెలంగాణ రాష్ట్ర సాధనలో తన ఇంటిని సైతం తెరాస పార్టీ కార్యాలయం కోసం త్యాగం చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని సీఎం కేసీఆర్ అధికార మదంతో విస్మరించారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 8వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
రాష్ట్రం ఏర్పడితే.. ఆకలి చావులుండవని.. బతుకులు మారుతాయని.. కేసీఆర్ మభ్యపెట్టారని.. ఇచ్చిన హామీలన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో ప్రతి సోమవారం చేనేత వస్రాలు వాడాలని చెప్పి.. అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం ఇచ్చి.. ఇంటికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 27న జరుగనున్న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:ప్రగతిభవన్ ముట్టడికి ప్రైవేట్ డ్రైవర్ల యత్నం