సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 30శాతం ఫిట్మెంట్ ఇచ్చి సంతోషపరిచారు కానీ.. ఇప్పటి వరకు గిరిజనులకు రిజర్వేషన్లు మాత్రం అమలు కాలేదని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ధ్వజమెత్తారు.
'సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఆ పనిచేసి.. ఓట్లు అడగాలి'
మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇచ్చారు కానీ.. గిరిజనులకు రిజర్వేషన్లు మాత్రం అమలు కాలేదని ధ్వజమెత్తారు.
'సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఆ పనిచేసి.. ఓట్లు అడగాలి'
ఓబీసీ రిజర్వేషన్ అమలైందని.. గిరిజనులకు రిజర్వేషన్ ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. గన్‌పార్క్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన రాములు నాయక్... ఏప్రిల్ 27 నుంచి బంజారాహిల్స్‌లోని కేసీఆర్ పాత ఇంటి నుంచి వరంగల్ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు ఇచ్చి నాగార్జునసాగర్‌లో ఓట్లు అడగాలన్నారు.
ఇదీ చదవండి:'ఐఓటీ'.. భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే టెక్నాలజీ