ప్రభుత్వం తనపై ఉద్ధేశపూర్వకంగాని కేసులు పెట్టి వేధిస్తోందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొన్న తనపై సీఎం కేసీఆర్ కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. గత 13 నెలల క్రితం ఎర్రగడ్డ ప్రాంతంలో జరిగిన చిన్నపాటి గొడవకు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. పోలీస్ స్టేషన్ చుట్టూ కావాలనే తిప్పుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
ప్రభుత్వం పగ సాధిస్తోంది : మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ - ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్
ప్రభుత్వం కావాలనే తనపై కేసులు పెట్టి.. కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనపై సీఎం కేసీఆర్ కావాలని కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వం పగ సాధిస్తోంది : మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్
ఎన్ని కేసులు పెట్టినా భయపడనని.. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతానని అన్నారు. గతంలో జరిగిన గొడవ కేసు పెండింగ్లో ఉందని కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల ఠాణాకు పిలిపించి నోటీసులు ఇచ్చినట్లు సీఐ సైదులు తెలిపారు.
ఇదీ చదవండి:మృత్యు కుహరాలుగా మారుతున్న నాలాలు