తెలంగాణ

telangana

ETV Bharat / state

Compliant on Revanth Reddy రేవంత్‌ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు, ఎందుకంటే - రేవంత్‌పై ఫిర్యాదు

Compliant on Revanth Reddy టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనపై రేవంత్‌ వ్యాఖ్యల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ నిరాధార అరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Compliant on Revanth Reddy
Compliant on Revanth Reddy

By

Published : Aug 27, 2022, 5:21 PM IST

Compliant on Revanth Reddy: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీసులకు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచార ఘటనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్దమ్మతల్లి గుడి ఆవరణలో ఘటన జరిగిందన్న వ్యాఖ్యల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడటం సరికాదన్నారు.

పీసీసీ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు పెద్దమ్మ తల్లి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో రేవంత్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏసీపీని కలిశారు. విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం పెద్దమ్మ తల్లి ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details