EX MLA Shakeel Son Case Update : ప్రజాభవన్ (పూర్వ ప్రగతిభవన్) వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.సురేందర్ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సి.ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాల్లేకుండా కేసు నమోదు చేశారని ఆరోపించారు.
High Court on EX MLA Shakeel Son Accident Case :ఇదే కేసులో రెండో నిందితుడి నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారని, అది చెల్లదని అన్నారు. ఏపీపీ సుదర్శన్ వాదనలు వినిపిస్తూ సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయడానికి నిందితుడు అందుబాటులో లేరని, దుబాయ్‌లో ఉన్నారని తెలిపారు. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి విచారణ చేపట్టాల్సి ఉందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఈ నెల 17లోగా నిందితుడు దర్యాప్తు అధికారి ముందు హాజరై విచారణకు సహకరించాలని ఆదేశాలు ఇవ్వబోగా, సాహిల్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ పిటిషన్ ఉపసంహరణకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. దానికి న్యాయమూర్తి అనుమతిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.
ప్రజాభవన్ కారు ఘటన - మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఎలా తప్పించారంటే?
అసలేం జరిగిందంటే :ఈ నెల 23వ తేదీన అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారు ఢీకొట్టింది. దీంతో పంజాగుట్ట పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకున్నారు. కారు సాహిల్దేనని, నడిపింది కూడా అతనేనని పోలీసులు గుర్తించారు. బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ కోసం అతనిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.