సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకుండా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. కేసీఆర్‌కు భయంపట్టుకుందని అభద్రతా భావంలో ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అవకాశం ఉందని భయపడుతున్నారని అన్నారు. కేసీఆర్‌కు తన ఇంటి నుంచే ప్రమాదం ఉందన్న ఆయన... హరీశ్ రావో, కేటీఆర్ రూపంలోనో కేసీఆర్‌కు ముప్పు ఉందన్నారు. రేపటి సడక్‌బంద్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. అన్నివర్గాల ప్రజలు సడక్ బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
'ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేసీఆర్ ఇంటినుంచే కుట్ర' - EX MLA Kunamneni Sambasiva Rao was fire on the Chief Minister KCR
ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకుండా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
EX MLA Kunamneni Sambasiva Rao was fire on the Chief Minister KCR