హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. మెట్రోరైల్, పీవీ ఎక్స్‌ప్రెస్ వంతెన, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఓఆర్‌ఆర్, కృష్ణా నీటి తరలింపు తదితరాలు తామే తెచ్చామని ఆయన వివరించారు.
ఆ మూడు పార్టీలది ఊసరవెళ్లి స్వభావం: షబ్బీర్ అలీ - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊసరవెళ్లిలా రంగులు మార్చే పార్టీలు ప్రజలను మభ్యపెట్టడానికి ముందుకొస్తున్నాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఆ మూడు పార్టీలది ఊసరవెళ్లి స్వభావం: షబ్బీర్ అలీ
తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క మోరీ అయినా శుభ్రం చేయలేదని ఆరోపించారు. ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు మార్చుకుని మూడు పార్టీలు వస్తున్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భాజపా, తెరాసలు పిల్లి- ఎలుక ఆట ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి :పోస్టల్ బ్యాలెట్ ఓటుకు నిబంధనలు ఇవే...