తెలంగాణ

telangana

ETV Bharat / state

Mohammed fariduddin : గుండెపోటుతో మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ మృతి.. సీఎం సంతాపం - తెలంగాణ వార్తలు

Mohammed fariduddin : తెరాస నేత మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌ (64) గుండెపోటుతో మృతి చెందారు. ఫరీదుద్దీన్‌ మృతిపై సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Mohammed fariduddin
Mohammed fariduddin

By

Published : Dec 30, 2021, 6:40 AM IST

Updated : Dec 30, 2021, 6:46 AM IST

Mohammed fariduddin : ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, తెరాస నేత మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌ (64) కన్నుమూశారు. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. బుధవారం రాత్రి అక్కడే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గ పరిధి హోతి(బి) గ్రామంలో జన్మించిన ఫరీదుద్దీన్‌ విద్యాభ్యాసం అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. స్వగ్రామంలో సర్పంచిగా గెలిచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జహీరాబాద్‌ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో రెండోసారి విజయం సాధించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో మైనారిటీ సంక్షేమం, సహకార శాఖల మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెరాసలో చేరారు. 2016లో తెరాస తరఫున శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. ఫరీదుద్దీన్‌ మృతిపై సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు.

గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మంత్రులు మహమూద్‌అలీ, హరీశ్‌రావు ఆసుపత్రికి వెళ్లి ఫరీదుద్దీన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌ తదితరులు సంతాపం తెలిపారు.

ఇదీ చూడండి:new year celebrations Guidelines : న్యూ ఇయర్​ వేడుకలు సిద్ధమవుతున్నారా..? ఇవి తెలుసుకోవాల్సిందే..

Last Updated : Dec 30, 2021, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details