Mekathoti Sucharita news: రాజకీయాల్లో ఉంటే వైసీపీలోనే ఉంటానని.. లేకపోతే ఇంట్లో ఉంటానని ఏపీ మాజీ హోం మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో నిర్వహించిన పింఛను పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇటీవల వస్తున్న పార్టీ మారుతారనన్న ఊహాగానాలకు మేరకు ఆమె స్పందించారు.
ఉంటే వైసీపీలోనే ఉంటా.. లేకపోతే ఇంట్లో ఉంటా: మేకతోటి సుచరిత - Mekathoti Sucharita comments On Party Change
Mekathoti Sucharita news: తన రాజకీయ ప్రస్థానంపై ఏపీ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మేల్యే మేకతోటి సుచరిత మరోసారి వివరణ ఇచ్చారు. తాను పక్క పార్టీల వైపు ఎప్పుడు చూడలేదని అన్నారు. తాను ఎప్పటికైనా తమ అధినేత వెంటే ఉంటానని ఆమె తెలిపారు.
తన రాజకీయ ప్రస్థానం సీఎం జగన్‌తోనేనని ఆన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఏదో వస్తే అపార్థం చేసుకుని రకరకాలుగా ప్రచారం చేయటం సరికాదన్నారు. భర్త ఎటు ఉంటే భార్య అటు ఉంటుందనడంలో తప్పేముందన్నారు. పార్టీ మారాలనుకుంటే నాయకులు, కార్యకర్తలతో చర్చిస్తానని.. లేనిపోని అపోహలు ప్రజల్లోకి తీసుకెళ్లవద్దంటూ కోరారు.
"జగన్మోహన్రెడ్డి వెంట నడిచే వారిలో ప్రథమరాలినని గర్వంగా చెప్పుకుంటున్నాను. రాజకీయ ప్రస్థానం ఉంటే జగన్మోహన్ రెడ్డితోనే. నేను చాలాసార్లు చెప్పాను. రాజకీయంగా ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా.. లేకుంటే నా ఇంట్లో ఉంటా. నేను పక్క పార్టీలా వైపు చూసింది లేదు. చూడబోయేది లేదు." -మేకతోటి సుచరిత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే