Ex Minister Malla Reddy Files Quash Petition : శామీర్‌పేట పీఎస్‌లో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 6న మల్లారెడ్డిపై ఛీటింగ్, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. 7 ఎకరాలు కబ్జా చేశారనే ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు పెట్టారనిమల్లారెడ్డి (Malla Reddy)పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్ శుక్రవారం (ఈ నెల 22) విచారణకు రానుంది.
నేను భూకబ్జా చేయలేదు - నాకు అంత అవసరం లేదు : మాజీ మంత్రి మల్లారెడ్డి
శామీర్‌పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 33, 34, 35లో ఉన్న 47 ఎకరాల 18 గుంటల ఎస్టీ వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారని శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మాజీమంత్రి మల్లారెడ్డి అతని అనుచరులపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు