నేను భూకబ్జా చేయలేదు - నాకు అంత అవసరం లేదు : మాజీ మంత్రి మల్లారెడ్డి EX Minister Malla Reddy Clarity on land Issue :భూకబ్జా ఆరోపణల విషయంలో తనపై కేసు నమోదు కావడంపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యేమల్లారెడ్డి స్పందించారు. తాను భూకబ్జాకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. కబ్జా చేయవలసిన అవసరం తనకు లేదని అన్నారు. గిరిజనుల 47 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్య ఉన్నట్లు భావించడం లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి వివరించారు.
ఇదీ జరిగింది :మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన కుమారులు, అనుచరులు 9 మందిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసులు నమోదయ్యాయి. 47 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో భూమిని రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు రావడంతో నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరికొందరిపై ఇన్వెస్టిగేషన్ :గతంలో బీఆర్ఎస్ సర్కార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూములు దోచుకున్న వారిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతల్లో చాలా మందిపై భూకబ్జా ఆరోపణలు వచ్చినా, పోలీసు స్టేషన్లకు ఫిర్యాదులు వెళ్లినా వాటిపై కేసులు నమోదు కాలేదు. అలాగే ఎటువంటి దర్యాప్తు కూడా మొదలవ్వలేదు.
Minister Mallareddy Dance in Kukatpally : మరోసారి డ్యాన్స్ ఇరగదీసిన మంత్రి మల్లారెడ్డి.. వీడియో వైరల్
ప్రస్తుతం అలాంటి అంశాలన్నీ తెరపైకి వస్తున్నాయి. ఇటీవలే నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి లీజుకు తీసుకున్న భూముల వ్యవహారంతో ప్రారంభమైన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి దాకా వచ్చింది. రానున్న రోజుల్లో మరికొందరిపైనా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేందుకు కొత్త ప్రభుత్వం కసరత్తు స్టార్ట్ చేసినట్లు సమాచారం.
Police Case on EX Minister Mallareddy :గత కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, అధికారబలంతో ప్రజలకు ప్రశ్నించే అవకాశం లేకుండా చేసిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని అప్పుడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో ప్రస్తావించింది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడడంతో పోలీసు స్టేషన్లలో పేరుకుపోయిన పాత ఫిర్యాదులు తెరమీదకు వస్తున్నాయి. గతంలో ఏయే గులాబీ నేతలపై భూకబ్జా, ఆక్రమణలు చేశారనే కంప్లైంట్స్ వచ్చాయో ఇప్పుడు వెలుగులోకి రానునట్లు సమాచారం. మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తర్వాత ఎవరి పేరు బయటకు వస్తుందనేది ప్రస్తుతం రాజకీయ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.
మాజీమంత్రి మల్లారెడ్డి అతని అనుచరులపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఆ లోక్‌సభ స్థానం నుంచి గెలిస్తే - మంత్రి పదవి పక్కా!