BRS MLC K Damodar Reddy will join Congress : పాలమూరు నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే దామోదర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు చూస్తుంటే ఈ వార్తకు మరింత బలం చేకూరుతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిని ఇరువురు కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు గురించి విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ భేటీ అనంతరం కాంగ్రెస్‌లో చేరే అవకాశంపై కె దామోదర్ రెడ్డి స్పష్టమైన ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది.
మరోవైపు కాంగ్రెస్ నేతలతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలైన మల్లు రవి, కొల్లాపూర్ నేత జగదీశ్వర్‌రావుతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇద్దరితో వేర్వేరుగా సమావేశమైన జూపల్లి కృష్ణారావు.. రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
K Damodar Reddy meet with Mallu Ravi : మల్లు రవితో భేటీ అనంతరం దామోదర్ రెడ్డి స్పందించారు. నాగం జనార్దన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత తన తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు. నాగంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన.. కొన్ని ఇబ్బందులు వచ్చి కాంగ్రెస్‌ను వీడినట్లు తెలిపారు. తాను 20 ఏళ్లు కాంగ్రెస్‌లో పని చేశానని.. మళ్లీ అదే పార్టీలోకి వస్తే ఎలా ఉంటుందని మల్లు రవిని అడిగినట్లు పేర్కొన్నారు. దీనికి ఆయన సానుకూలంగా ఆహ్వానించినట్లు తెలిపారు. బీఆర్ఎస్తో క్యాడర్‌తో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు గుర్తు చేసుకున్న దామోదర్ రెడ్డి.. ఆ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడు పార్టీ మార్పుపై తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు.
దామోదర్ రెడ్డి, జూపల్లి శ్రీనివాస్‌రెడ్డి భేటీలపై మల్లు రవి స్పందించారు. సోమవారం జరగనున్న పొంగులేటి ప్రెస్ మీట్‌పై జూపల్లితో చర్చించినట్లు పేర్కొన్నారు. ఈనెల 12, 13, 14 తేదీల్లో నేతల చేరికల అంశంపై క్లారిటీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు గురించి చర్చినట్లు చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఒక తాటిపైకి రావాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. పీసీసీ చీఫ్, సీఎల్పీ నాయకులతో చర్చించిన తర్వాత దామోదర్ రెడ్డి అంశం క్లారిటీ వస్తుందని చెప్పారు.
Ponguleti And Jupally To Join Congress Party : తాజా పరిణామాలు చూస్తుంటే.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అనేక తర్జనభర్జనలు, చర్చల నడుమ కాంగ్రెస్‌లో చేరేందుకు ఈ ఇద్దరు నేతలు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
Ponguleti to Join Congress : కాంగ్రెస్ అధిష్ఠానం కూడా, కె.దామోదర్ రెడ్డి, పొంగులేటి, జూపల్లిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. వారికి పార్టీలో తగిన ప్రాధాన్యమివ్వడానికి కూడా సానుకూలంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సునీల్ కనుగోలుతో జరిగిన చర్చల్లో.. అభ్యర్థులు, నియోజకవర్గాల అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇవీ చదవండి: