ప్రగతిభవన్ వద్దకు వచ్చిన మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు - Ex Minister JC Diwakar reddy at pragathi bhavan
13:27 January 19
Ex Minister JC Divakarreddy: ప్రగతిభవన్ వద్దకు వచ్చిన మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి
Ex Minister JC Divakarreddy: సందర్భానుసారంగా అప్పుడప్పుడు తెలంగాణలో ప్రత్యక్షమవుతుంటారు మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి. ఇవాళ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రగతిభవన్ వద్దకు వెళ్లారు. అక్కడికి చేరుకున్న జేసీ దివాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రగతిభవన్‌లోకి అనుమతించేది లేదని వారు స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక ఆయన అక్కడినుంచి వెనుదిరిగారు. అయితే జేసీ ప్రగతిభవన్‌కు ఎందుకు వచ్చారనే విషయంలో స్పష్టత లేదు.
గతంలోనూ పలు సందర్భాల్లో కాంగ్రెస్ నేతలను కలిసేందుకు జేసీ తెలంగాణ అసెంబ్లీకి వచ్చి వారితో కాసేపు ముచ్చటించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి తెలంగాణకు వస్తా. మేం తెలంగాణ వదిలిపెట్టి నష్టపోయాం. రాయల తెలంగాణ కావాలని నాడు జైపాల్‌రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదు’’ అని జేసీ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి సైతం గురయ్యారు.