తెలంగాణ

telangana

ETV Bharat / state

Peddireddy resigns: భాజపాకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా - ex minister inugala peddi reddy resigned to bjp

రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మరో షాక్​ తగిలింది. మాజీ మంత్రి, భాజపా నేత ఇనుగాల పెద్దిరెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కి పంపారు.

ex minister inugala peddi reddy resigned
మాజీమంత్రి పెద్దిరెడ్డి రాజీనామా

By

Published : Jul 26, 2021, 7:52 PM IST

భాజపాకు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి రాజీనామా లేఖ పంపారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి తాను భాజపాలో సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి అవకాశం కల్పించిన జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పార్టీలో కొనసాగడానికి తన మనసు అంగీకరించడంలేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. అందుకే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి:మంత్రి కేటీఆర్​ పర్యటనలో కానిస్టేబుల్​, మహిళా ఎస్సై మధ్య వాగ్వాదం

ABOUT THE AUTHOR

...view details