తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి గీతారెడ్డి స్పష్టం చేశారు. ఈశ్వరీబాయి 30వ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్లో సంగీత్ వద్ద ఆమె విగ్రహానికి గీతారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఈశ్వరీబాయి చేసిన సేవలు మరువలేనివని గీతారెడ్డి అన్నారు. చిన్న స్థాయి నుంచి మంత్రి వరకూ ఎదిగిన ఆమె.. ఉన్నత పదవులు వచ్చినా ప్రజాసేవ కోసం కట్టుబడి ఉన్నారని కొనియాడారు. ఈశ్వరీబాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళుతున్నట్లు వెల్లడించారు.