తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆనాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రపన్నారు' - ts news

Ex Minister Chandrashekar on KCR: సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2001కి ముందు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోయాలని కేసీఆర్​ కుట్ర పన్నారని తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా 60 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కటయ్యారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

'ఆనాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రపన్నారు'
'ఆనాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రపన్నారు'

By

Published : Jun 2, 2022, 4:32 PM IST

Ex Minister Chandrashekar on KCR: మాజీ మంత్రి చంద్రశేఖర్ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రపన్నారని తెలిపారు. నాగోల్ తట్టి అన్నారం జే కన్వేన్షన్ లో భాజపా ఏర్పాటు చేసిన 'అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్ష సాధన' సభలో చంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యేలను సంప్రదించారని.. 60మంది ఎమ్మెల్యేలు ఒకే చెప్పారని పేర్కొన్నారు. 61వ వ్యక్తిగా జ్యోతుల నెహ్రూను సంప్రదిస్తే అయన వెళ్లి చంద్రబాబుకు సమాచారం ఇచ్చారని చంద్రశేఖర్ వివరించారు.

"చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కేసీఆర్‌ కుట్ర చేశారు. 2001కి ముందు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్ర చేశారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యేలను సంప్రదించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా 60 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కటయ్యారు. 61వ వ్యక్తిగా జ్యోతుల నెహ్రూను సంప్రదించారు. జ్యోతులనెహ్రూ వెళ్లి చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు." -చంద్రశేఖర్‌, మాజీ మంత్రి

'ఆనాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రపన్నారు'

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details