Ex Minister Chandrasekhar Joining in Congress : ఈ నెల 18న జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆ పార్టీలో చేరనున్నారు. చంద్రశేఖర్ చేరికపై చర్చలు జరిపేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని మాజీమంత్రి నివాసానికి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెళ్లారు. వారివురు సుమారు అరగంట పాటు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని రేవంత్ తెలిపారు. ఇందుకు అంగీకరించిన చంద్రశేఖర్... ఈ నెల 18న జరిగే పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ సభలోనే పేదలకు మేలు జరిగే డిక్లరేషన్ ప్రకటన ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు కర్తవ్యం నిర్వహించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దళితులకు, గిరిజనులకు ఇచ్చే అసైన్డ్ భూములకు వారికే పూర్తి యాజమాన్య హక్కు కలిగించాలని చంద్రశేఖర్ సూచించారని.. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని తెలిపారు.
Former Minister Chandrasekhar Resigned from BJP : 'రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరతా'
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఇచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుంటోంది. దళితుల భూములను రకరకాల రూపాల్లో రూ.35లక్షల ఎకరాలు ప్రభుత్వం దోచుకుని.. వేలం వేస్తోంది. దళితులకు, గిరిజనులకు ఇచ్చే అసైన్డ్ భూములకు వారికే పూర్తి యాజమాన్య హక్కు కలిగించాలని చంద్రశేఖర్ సూచించారు. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని.. ఆ రెండింటి మధ్య ఫెవికాల్ బంధం ఉంది- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Chandrashekar Reason Of Region BJP :మాజీమంత్రి చంద్రశేఖర్...శనివారం రాత్రి బీజేపీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్(Bandi Sanjay)ని మార్పు చేసిన దగ్గర నుంచి.. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు ఇటీవల ఈటల.. చంద్రశేఖర్ ఇంటికి వెళ్లిన ప్రయోజనం లేకపోయింది. కిషన్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడినా చంద్రశేఖర్ మెత్తబడలేదు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు.