తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టాభిని చంపాలనే దాడి చేశారు: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​లో తెదేపా నేత పట్టాభిపై దాడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. విజయవాడ గురునానక్ నగర్​లోని పట్టాభి ఇంటికెళ్లి పరామర్శించారు. 15 మంది చుట్టుముట్టి ఇనుపరాడ్లు, బండరాళ్లతో కారు ధ్వంసం చేయడం, పట్టాభిని గాయపర్చడం, వైకాపా గుండారాజ్​కు ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు.

పట్టాభిని చంపాలనే దాడి చేశారు: చంద్రబాబు
పట్టాభిని చంపాలనే దాడి చేశారు: చంద్రబాబు

By

Published : Feb 2, 2021, 2:32 PM IST

పట్టాభిని పరామర్శించిన చంద్రబాబు

పట్టాభిని చంపాలనే దాడి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దుండగుల దాడిలో గాయపడిన పట్టాభిని ఏపీలోని విజయవాడ గురునానక్ నగర్​లోని ఆయన ఇంట్లో చంద్రబాబు పరామర్శించారు. పట్టాభితో మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు. వైకాపా నేతలు రౌడీల్లా తయారవుతున్నారని.. పట్టాభిపై దాడికి ఏపీ సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. పట్టాభిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి అని చంద్రబాబు అన్నారు. పట్టాభికి వ్యక్తిగతంగా విరోధులు ఎవరూ లేరని.. ప్రజల కోసమే పోరాడుతున్నారని పేర్కొన్నారు.

పట్టాభిని చంపాలనే దాడి చేశారు: చంద్రబాబు

నన్నూ చంపుతారా..?

'ఎంతమందిని చంపుతారు..?..చంపుతారా..? నన్ను కూడా చంపండి. జాగ్రత్తగా ఉండాలని వైకాపా నేతలను హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రి.. మీ మంత్రులకు ఇది సరికాదని చెప్పండి. సీఎం... వైకాపా నాయకులు, కార్యకర్తలను అదుపు చేసుకోవాలి. పట్టాభిపై మొదటిసారి దాడి చేసినప్పుడే చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పోలీసులు ఏం చేస్తున్నారు..? పోలీసులకు జీతాలు ఇచ్చేది జగన్ కాదు.. ప్రజల సొమ్మే' - చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రికి మెమోరాండం..

తెదేపా నేతలు ఏపీ ముఖ్యమంత్రిని కలిసి మెమోరాండం ఇస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్​ సీఎంను కలిసేందుకు.. గాయపడిన పట్టాభి కూడా వెళ్తారని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులపై ప్రజలు కూడా ఆలోచించాలని సూచించారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే ఆడపిల్లలకు కూడా రక్షణ ఉండదని చంద్రబాబు వెల్లడించారు.

ఇదీ చదవండి :నిమ్మాడలో ఉద్రిక్తత ... కోటబొమ్మాళి కోర్టుకు అచ్చన్న

ABOUT THE AUTHOR

...view details