రాష్ట్ర అభివృద్ధికి దివంగత భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఎంతో కృషి చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆమె జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి భాజపా కార్యాలయంలో కిషన్ రెడ్డి, మహిళా మోర్చా నేతలు, కార్పొరేటర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాష్ట్ర ఏర్పాటులో సుష్మాస్వరాజ్ ఎనలేని కృషి : కిషన్ రెడ్డి - సుష్మాస్వరాజ్‌కు నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మహిళా మోర్చా నేతలు, కార్పొరేటర్లు
తెలంగాణ ఏర్పాటులో దివంగత భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ కృషి ఎనలేనిదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆమె 68వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు నివాళులర్పిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భాజపా నేతలు
రాష్ట్ర ఏర్పాటులో సుష్మాస్వరాజ్ కృషి ఎనలేనిదని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రిగా తెలంగాణ కోసం ఎంతో చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆమెకు రుణపడి ఉన్నామన్నారు. ప్రవాస భారతీయులకు ఏ సమస్య వచ్చినా స్పందించేవారని తెలిపారు. ఎంపీగా గెలిచిన నాపై ప్రత్యేక అభిమానం కురిపించారని కిషన్ రెడ్డి వెల్లడించారు. భాజపా ఆలోచనలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన సుష్మా స్వరాజ్‌ను తెలంగాణ ఎప్పటికీ మర్చిపోదని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.