అల్వాల్ పరిధిలోని లక్ష్మీ కళామందిర్ థియేటర్ ప్రాంగణంలో మాజీ ఎంపీ, భాజపా నాయకుడు వివేక్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా సమయంలో జర్నలిస్టులు చేస్తున్న సేవలను గుర్తించి వారికి సన్మానం చేసి నిత్యావసరాలు పంపిణీ చేశారు.
'విపత్కర పరిస్థితుల్లో టీమ్ సాయి సేవలు హర్షణీయం'
ప్రధాని మోదీ ఆదేశాల మేరకు లాక్డౌన్ సమయంలో టీమ్ సాయి ఆధ్వర్యంలో అల్వాల్ పరిధిలో చేస్తున్న సేవ కార్యక్రమాలను మాజీఎంపీ వివేక్ అభినందించారు. అనంతరం జర్నలిస్టులకు సన్మానం చేసి వారికి నిత్యావసర సరుకులు అందించాడు.
జర్నలిస్టులకు సన్మానం చేసిన మాజీ ఎంపీ
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో టీమ్ సాయి అల్వాల్లో చేస్తున్న సేవలను ఆయన పొగిడారు. సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పలు ప్రాంతాల్లో పిచికారి చేయడం... దాదాపు రెండు లక్షల మందికి పైగా భోజన ప్యాకెట్లను అందించడం, పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంచుతూ ఆపన్న హస్తాన్ని అందించడం గొప్ప విషయమని అభినందించారు.
ఇవీ చూడండి:ప్రతి కుటుంబానికి రూ.1500 నగదు ఇచ్చే కార్యక్రమం నిలిపివేత