EVM Distribution Process Begins in Telangana : తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంల కేటాయింపుపై కసరత్తు.. బుధవారంలోగా పూర్తి చేయాలని అధికారులకు ఎన్నికల సంఘం స్పష్టం (Election Commission) చేసింది. ప్రతి నియోజకవర్గానికి కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్లు వీవీప్యాట్‌ల పంపిణీ ప్రక్రియను.. 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టామని ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వాటి తొలిదశ తనిఖీలు పూర్తి చేసిన తర్వాత కేటాయిస్తున్నామని చెప్పింది. మరో 41 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అదనపు బ్యాలెట్ యూనిట్లు పంపామని పేర్కొంది. అక్కడ కూడా తొలి విడత తనిఖీలు పూర్తి చేసి కేటాయించాలని చెప్పామని వెల్లడించింది.
తెలంగాణలో పక్కా ప్రణాళికతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి : సీఈసీ
EC Arrangements Telangana Assembly Elections :సువిధ పోర్టల్ ద్వారా పార్టీలు, అభ్యర్థులకు ఇప్పటి వరకు 22,254 అనుమతులు ఇచ్చామని అధికారులు తెలిపారు. సీ-విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 5183.. 1950 హెల్ప్‌లైన్‌కు 1987 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. నేషనల్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సర్వీస్‌కు 20,670 ఫిర్యాదులు వస్తే అందులో 20,302 పరిష్కరించామని చెప్పారు. జిల్లా కాల్ సెంటర్లకు 4673 ఫిర్యాదులు రాగా.. అందులో 4543 పరిష్కరించినట్లు అధికారులు వివరించారు.
Huge Amount Of Money Seized in Telangana During Election Code :ఎన్నికల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.603 కోట్ల విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. అందులో నగదు రూ.214 కోట్లు కాగా.. బంగారు, ఆభరణాల విలువ రూ.179 కోట్లని చెప్పారు. రూ.96 కోట్ల మద్యం, రూ.34 కోట్ల డ్రగ్స్, రూ.78 కోట్ల విలువైన ఇతర వస్తువులు పట్టుబడ్డాయని అధికారులు వివరించారు.
మరోవైపు భద్రత అవసరాలు ఉన్న వారు మినహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ వాహనాలు వినియోగించకూడదనిఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఏదో కారణంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అధికారులు సైతం.. ప్రభుత్వ వాహనాలు ఉపయోగించకూడదని తెలిపింది. రాజకీయ పార్టీల వారు, అభ్యర్థులు ఎన్ని వాహనాలనైనా ఉపయోగించవచ్చని పేర్కొంది. కానీ అన్నింటికి ముందస్తు అనుమతి ఉండాలని వివరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, జనసేన, బీఎస్పీ తదితర పార్టీల నుంచి.. 293 మంది స్టార్ క్యాంపెయినర్లకు అనుమతి ఇచ్చామని ఎన్నికల సంఘం వెల్లడించింది.