ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన అసోంకు చెందిన జాదవ్ మొలాంగ్ హైదరాబాద్లో పర్యటించారు. జాదవ్ అరణ్య భవన్లో అటవీశాఖ అధికారులు, సిబ్బందితో సమావేశమై తన అనుభవాలు పంచుకున్నారు. వర్షాలు, వరదల వల్ల బ్రహ్మపుత్రా నది కోతకు గురై జరుగుతోన్న ప్రకృతి విధ్వంసాన్ని చూసి దాదాపు 550 హెక్టార్లలో ఆయన అడవిని పెంచారు. ఆయన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దేశవ్యాప్తంగా పర్యావరణ ప్రమాద హెచ్చరికలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన... ఉన్న అడవిని కాపాడుకోవడంతోపాటు కొత్తగా అడవులు అభివృద్ధి చేయడం తక్షణ అవసరమని అన్నారు.
'పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి' - Everyone should strive to protect the environment
పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన అసోంకు చెందిన జాదవ్ మొలాంగ్ అన్నారు. హైదరాబాద్ పర్యాటనలో ఉన్న జాదవ్ అరణ్య భవన్లో అటవీశాఖ అధికారులు, సిబ్బందితో సమావేశమై తన అనుభవాలు పంచుకున్నారు.
జాదవ్ మొలాంగ్