పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని జవహర్ నగర్‌లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. కాలుష్య నివారణతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. మట్టి వినాయకుల పంపిణీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: ఎమ్మెల్యే ముఠా గోపాల్ - ముషీరాబాద్ ఎమ్మెల్యే
ముషీరాబాద్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు.
'పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'
Last Updated : Sep 1, 2019, 4:24 PM IST