తెలంగాణ

telangana

ETV Bharat / state

'గో మహాగర్జన సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి' - తెలంగాణ తాజా వార్తలు

యుగ తులసి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు గో మహా గర్జన నమూనాను ఆవిష్కరించారు. ఏప్రిల్‌ ఒకటిన ఎన్టీఆర్‌ గ్రౌండ్‌లో ఆ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నాలని నిర్వాహకులు కోరారు.

Everyone should participate in the Go Maha garjana Sabha at ntr grounds
'గో మహాగర్జన సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి'

By

Published : Mar 13, 2021, 8:46 PM IST

సకల దేవతల స్వరూపి అయిన గోమాత గోసను ప్రపంచానికి వినిపించేలా.. గో మహాగర్జన సభను నిర్వహిస్తున్నట్లు యుగ తులసి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు శివకుమార్‌ అన్నారు. గోవును సంరక్షించుకోకపోతే మన భవిష్యత్‌ అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గో హత్యలు ఆపాలని, అక్రమ కబేళాలు మూసివేసి...గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ... ఏప్రిల్‌ ఒకటిన ఎన్టీఆర్‌ గ్రౌండ్‌లో గో మహాగర్జన సభను నిర్వహించనున్నారు.

గో మహా గర్జన నమూనాను ఆవిష్కరించి.. గ్రౌండ్‌లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో శివకుమార్‌తో పాటు ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయ్‌రామ్‌, పలువురు గోశాలల నిర్వహకులు, గో ప్రేమికులు పాల్గొని గోవును సంరక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గో పాత్రను వెలకట్టలేమని శివకుమార్‌ అన్నారు. ప్రతి ఒక్కరూ గో మహా గర్జన సభలో పాల్గొని గోమాత గోసను ప్రపంచానికి వినిపించాలని తెలిపారు. ఈ ప్రాణం గోమాత సేవ కోసమే అని.. రాజకీయాలకు స్వస్థి పలుకుతున్నట్లు ఆయన ప్రకటించారు. గో మహా గర్జన సభలో గోవుపై చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నామని.. అందులో మంచి ప్రతిభ కనబర్చిన చిన్నారులకు నగదు బహుమతులు అందచేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇదీ చూడండి :రాజన్న సన్నిధిలో గంగవ్వ.. అభిమానులతో సెల్ఫీలు

ABOUT THE AUTHOR

...view details