యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి సూచించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయగాన సభ శ్వాస ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన సదస్సు గానసభలో జరిగింది. సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులు అందరినీ తీవ్ర కలవరానికి గురి చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తరుణంలో గాలి కొనుగోలు చేసే పరిస్థితి రావడంపై విచారం వ్యక్తం చేశారు.
'కరోనాపై ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలి' - చిక్కడపల్లిలో కరోనాపై అవగాహన సదస్సు
సమాజాన్ని పట్టి పీడిస్తున్న కరోనాపై మరింత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయగాన సభ శ్వాస ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.
'కరోనాపై ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలి'
శ్వాస ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న కరోనాపై మరింత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు.