నిబంధనలు అతిక్రమించి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే ఎంతటివారినైనా సహించబోమని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాసయాదవ్ శుక్రవారం పదవీ బాధ్యతల స్వీకరించారు. ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ నెక్లెస్ రోడ్డు ప్రధాన రహదారిపై పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వీటిని ఏర్పాటు చేశారంటూ బాధ్యుడైన బాలరాజ్ యాదవ్కుజీహెచ్ఎంసీ రూ. 25 వేలుజరిమానా విధించింది. ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధించామని నాయకులు, ప్రజలు నిబంధనలను పాటించాలనిమేయర్ బొంతురామ్మోహన్ కోరారు.