తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో విదేశీ పక్షులు.. సందర్శకులకు ఆహ్లాదం

ఏటా వేల కిలోమీటర్ల ప్రయాణం.. సుమారు వంద ఎకరాల చెరువులో మకాం.. కొన్ని నెలల తర్వాత తిరుగు పయనం. ఇదేదో గెట్‌ టు గెథర్‌ కాదు.. కొన్ని రకాల పక్షుల ఆకలి పాట్లు. వివిధ దేశాల నుంచి ఆ చెరువుకి వచ్చి.. ఆకలి తీర్చుకుంటాయి. ఖండాలు దాటి వచ్చే ఆ పక్షులను స్థానికులు అపురూపంగా చూసుకుంటుంటారు. అదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే!

By

Published : Apr 26, 2021, 1:34 PM IST

every-year-a-variety-of-birds-come-to-the-venkannadora-cheruvu-from-abroad
ఏపీలో విదేశీ పక్షులు.. సందర్శకులకు ఆహ్లాదం

ఏపీలో విదేశీ పక్షులు

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడి వెంకన్నదొర చెరువు, దాని పరిసరాలకు ప్రతి ఏటా వివిధ దేశాల నుంచి రకరకాల పక్షులు వస్తుంటాయి. మధ్య ఆసియా, సైబీరియా, మంగోలియా, హిమాలయ ప్రాంతాలు మంచుతో నిండిపోయినప్పుడు అక్కడ ప్రయాణం ప్రారంభించి.. 10 నుంచి 15 రోజుల పాటు వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇక్కడికి వస్తాయి. ఆరునెలలకు పైగా ఈ పరిసరాల్లోనే సంచరిస్తూ.. వివిధ రకాల పురుగులు, కీటకాలను తింటూ కడుపు నింపుకుంటాయి. కొన్ని పక్షులు చేపల్ని కూడా తింటాయి. స్థానికులకు, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి.

చెరువు పరిసరాల్లో సందడి..

ఈ ఏడాది కూడా వెంకన్నదొర చెరువు పరిసరాల్లో ఆ పక్షులు సందడి చేస్తున్నాయి. చెరువుబాతు, సూది తోక బాతు, తెడ్డు మూతి బాతు, చుక్క మూతి బాతు, దూది చిలువ, బ్రాహ్మిణ్‌ బాతు, ఈల వేసే చిన్న చిలువ, ఎర్రతల చిలువతో పాటు రకరకాల కొంగలూ కనువిందు చేస్తున్నాయి.

పక్షులు నిత్యం ఉండేందుకు వీలుగా చెరువును లోతు చేయించాలని, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కొన్ని నెలల పాటూ ఆహ్లాదాన్ని పంచే ఈ విహంగాలు వర్షాకాల ప్రారంభంలో తిరిగి స్వస్థలాలకు ఎగిరిపోతాయి.

ఇదీ చదవండి:పెరుగు పులిసిపోకుండా.. రుచిగా ఉండాలంటే.!

ABOUT THE AUTHOR

...view details