తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతీ విశ్వవిద్యాలయానికి యూట్యూబ్​ ఛానల్​ ఉండాలి: గవర్నర్​ - తెలంగాణ యూవివర్సీలకు యూట్యూబ్ ఛానల్స్​

కరోనా పరిస్థితుల్లో ఆన్​లైన్​ తరగతులను ప్రొత్సహించాలని గవర్నర్​ తమిళిసై అధికారులకు సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయం అధికారులతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి యూనివర్సిటీకి ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ఉండాలన్నారు.

Every university should have a YouTube channel: Governor
ప్రతీ విశ్వవిద్యాలయానికి యూట్యూబ్​ ఛానల్​ ఉండాలి: గవర్నర్​

By

Published : Jun 27, 2020, 5:01 AM IST

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకులను మెరుగుపరచుకోవాలని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. యూనివర్సిటీల ప్రమాణాలు, ర్యాంకులు మెరుగుపడేలా ప్రోత్సహిస్తామని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణ యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయం అధికారులతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరిస్థితుల్లో యూనివర్సిటీలు ఆన్​లైన్​ తరగతులను ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. ప్రతి యూనివర్సిటీకి ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ఉండాలన్నారు. ఆన్​లైన్ వనరులను రూపొందించి యూనివర్సిటీ డేటాబేస్​లో అందుబాటులో ఉంచాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను పెంచాలని.. స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించాలని గవర్నర్​ సూచించారు.

ఇదీ చదవండి:యూనివర్సిటీ విద్యలో సమూల ప్రక్షాళన: గవర్నర్​

ABOUT THE AUTHOR

...view details