తెలంగాణ

telangana

ETV Bharat / state

పది వారాల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు - telangana 2021 news

పది వారాల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమాన్ని చేపట్టాలని పురపాలక శాఖ... అన్ని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. దోమల వ్యాప్తి నివారణ కోసం ప్రజలందరూ కలిసి కృషి చేయాలని సూచించింది.

every-sunday-ten-o-clock-ten-minutes-on-ten-weeks
పది వారాల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు

By

Published : Aug 26, 2021, 12:06 PM IST

రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో మలేరియా, డెంగీ తదితర వ్యాధుల నివారణకై పది వారాల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమాన్ని చేపట్టాలని పురపాలక శాఖ... అన్ని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. దోమ‌ల నివార‌ణ ప్రచారాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దోమ‌ల వ్యాప్తిని అరిక‌ట్టేందుకు 10 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల‌ని స్పష్టం చేసింది.

దోమలు వ్యాప్తి నివారిస్తే.. రోగాలు దరిచేరవు..

సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌కు రూపొందించిన కార్యాచ‌ర‌ణ ప్రణాళిక అమ‌లులో భాగంగా మ‌లేరియా, డెంగీ, చికెన్‌ గున్యా వ్యాధులను అరిక‌ట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ.. ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని పురపాలక శాఖ అదికారులు సూచించారు. ఇంటి పరిసరాలు, కార్యాల‌యాల‌్లో ఉన్న నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలుకు తెలిపారు. అలాగే పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే... రోగాల నుంచి అంత దూరంగా ఉండొచ్చని వివరించారు.

10 గంటలకు పది నిమిషాలు.. పది వారాలపాటు

ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు... ఎవరి ఇంట్లో వారు దోమల వ్యాప్తి నివారణకు కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలు, కార్యాలయాలు, పరిశ్రమల్లో... మూతలు లేని ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, పూల కుండీలు, కూలర్లు వంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని అధికారులు వివరించారు. దోమల వ్యాప్తి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతని... దోమల రహిత రాష్ట్రం కోసం ప్రజలందరూ కలిసి పోరాడాలని సూచించారు.

ఇదీ చూడండి:GIRL SUICIDE: ప్రేమ పేరుతో ఉపాధ్యాయుడి మోసం.. తట్టుకోలేక బాలిక ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details