తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాధుల నివారణే లక్ష్యం.. 'పది నిమిషాలు'లో మంత్రి..!

మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు... ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా... మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ఎల్​బి స్టేడియంలో పర్యటించారు. స్టేడియంలో దోమలు పెరిగేందుకు అవకాశం ఉన్న వర్షపు నీటి నిల్వలను తొలిగించారు.

every-sunday-10-am-10-minutes-program-at-lb-stadium-hyderabad
వ్యాధుల నివారణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి

By

Published : Jun 14, 2020, 1:47 PM IST

Updated : Jun 14, 2020, 2:29 PM IST

వర్షాకాలంలో విజృంభించే దోమల నివారణ, సీజనల్​ వ్యాధుల కట్టడికి మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు చేపట్టిన ప్రతి అదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 6వ వారంలో భాగంగా... హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని లాల్ బహదూర్ స్టేడియాన్ని పరిశీలించారు. అక్కడక్కడ నిల్వ ఉన్న వర్షపు నీరు, చెత్తను శుభ్రం చేయించారు. స్విమింగ్ పూల్, క్రీడా మైదానంలో దోమలు నివాసం ఉండే ప్రాంతాలలో మంత్రి పర్యటించి నివారణ చర్యలు తీసుకున్నారు.

దోమల ద్వారా సంక్రమించే అన్ని రకాల సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ వ్యాధి బారిన పడకుండా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు. డెంగీ, సీజనల్​ వ్యాధుల నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

వ్యాధుల నివారణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి

ఇదీ చూడండి:'కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే.. చంపేశారు'

Last Updated : Jun 14, 2020, 2:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details