పోలీసు ఉన్నతాధికారుల నుంచి హోంగార్డు వరకూ అందరూ హరితహారంలో పాల్గొనాలని... కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో అన్ని శాఖలు పాల్గొంటున్నాయని చెప్పారు. మొక్కలు నాటడానికి... వాటిని కాపాడటానికి పోలీసులు తమ వంతు కృషి చేయాలని కోరారు.
'హరితహారంలో పోలీసులు భాగస్వాములవ్వాలి' - Police Harithaharam
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో పోలీసులు సైతం భాగస్వాములవ్వాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి హరితహారంలో పాల్గొనాలని... దీనిపై నివేదికలను పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.
DGP_Mahender Reddy
ప్రస్తుతం ఉన్న వారితో పాటు శిక్షణ పొందుతున్న దాదాపు పదివేలమంది పోలీసు అభ్యర్థులు సైతం మొక్కలు నాటాలని స్పష్టం చేశారు. దీనిపై ప్రతి ఒక్క పోలీసు అధికారి శ్రద్ధ చూపాలని... ఈ నివేదికలను పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.