తెలంగాణ

telangana

ETV Bharat / state

'బాలికల రక్షణ కోసం అందరం కంకణం కట్టుకుందాం'

ఈ నెల 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్​లోని తన కార్యాలయంలో పోస్టర్​ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ బాలికా రక్షణకు ప్రతిన బూనాలని మంత్రి కోరారు.

By

Published : Jan 23, 2020, 7:46 PM IST

'బాలికా రక్షణ కోసం పోస్టర్​ ఆవిష్కరించిన మంత్రి సత్యవతి రాథోడ్'
'బాలికా రక్షణ కోసం పోస్టర్​ ఆవిష్కరించిన మంత్రి సత్యవతి రాథోడ్'

స్త్రీలను దేవతలుగా పూజించే సమాజం మనదని... బాలికల రక్షణ కోసం అందరూ పాటు పడాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. ఈ నెల 24న జాతీయ బాలికా దినోత్సవం నేపథ్యంలో పోస్టర్​ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఆడ పిల్లలను కాపాడాలని... బాలికా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ మేరకు ప్రతిన బూనాలని కోరారు.

ఆడపిల్లల పట్ల బాధ్యతతో మెలగాలి...

ప్రభుత్వం మహిళల సంక్షేమం, సంరక్షణ, భద్రతకు పెద్ద పీట వేస్తోందని సత్యవతి రాథోడ్ వెల్లడించారు. పౌరులందరూ ఆడపిల్లల పట్ల బాధ్యతగా ఉండాలని సూచించారు. లింగ వివక్షను రూపుమాపేందుకు బాలికల విద్య వికాసానికి అందరూ తోడ్పడాలని మంత్రి కోరారు. సీఎం కేసిఆర్ ప్రకటించిన ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమంలో మహిళలే ముందుండి నిరక్షరాస్యతను నిర్మూలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

'బాలికా రక్షణ కోసం పోస్టర్​ ఆవిష్కరించిన మంత్రి సత్యవతి రాథోడ్'

ఇవీ చూడండి : అత్యాచార నిందితున్ని శిక్షించాలంటూ విద్యార్థుల ర్యాలీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details