తెలంగాణ

telangana

By

Published : Mar 16, 2020, 4:43 PM IST

ETV Bharat / state

'ప్రజా ప్రతినిధులకు కూడా జనన ధ్రువీకరణ పత్రాలు లేవు'

ఎన్‌పీఆర్ వల్ల ఉత్పన్నమవుతున్న పరిణామాలను దేశ ప్రజల దృష్టికి సీఎం తీసుకొచ్చారని అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశంలో ఇది ఒక మతానికి సంబంధించిన సమస్య కాదన్నారు. జనన ధ్రువీకరణ పత్రాల సమస్య ప్రధానంగా ఉందన్నారు.

bhatti
bhatti

ఎన్‌పీఆర్ సమస్య పరిష్కారం కోసం అందరం ఏకం కావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశంలో వివిధ కులమతాల ప్రజలు జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఇది ఒక మతానికి సంబంధించిన సమస్య కాదని తెలిపారు. ఎంతో మంది ప్రజాప్రతినిధులకు జనన ధ్రువీకరణ పత్రాలు లేవన్నారు. అసలు సమస్య పుట్టిన తేదీ సర్టిఫికెట్స్​ అని ఆరోపించారు. ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో కూడా చాలామందికి జనన ధ్రువీకరణ పత్రాలు లేవన్నారు. కేంద్రం ప్రమాదకరమైన ఎన్‌పీఆర్ చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దేశంలోకి చొరబాటుదారులను అనుమతించాలని ఎవరూ చెప్పరని, అయితే సీఏఏ, ఎన్‌పీఆర్‌ను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తీర్మానంతో సరిపెట్టకుండా రాష్ట్రంలో అమలు చేయబోమని చట్టం తీసుకురావాలని కోరారు.

'ప్రజా ప్రతినిధులకు కూడా జనన ధ్రువీకరణ పత్రాలు లేవు'

ఇదీ చూడండి :కరోనా కట్టడికి ప్రత్యేక చెక్​పోస్టులు: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details