1.భూములిచ్చే కుటుంబానికో ఉద్యోగం
ప్రపంచంలోనే అతి పెద్ద ఔషధ పరిశ్రమల సమూహంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ ఔషధనగరిలో స్థానికులకు పెద్దపీట వేస్తామని, వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. అలాగే ప్రాజెక్టు కోసం భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వారి కోసం ఔషధనగరి పరిసరాల్లో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. భార్యను కత్తితో చంపేసి పారిపోయిన భర్త
భార్యను హత్య చేసి భర్త పరారైన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పాండు బస్తీలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలిని కత్తితో చంపినట్లు ప్రాథమిక నిర్ధరణ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రాష్ట్రంలో ఏ ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో ప్రవేశ పరీక్షలకు కొత్త తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈసెట్‌ను ఈ నెల 31న నిర్వహిస్తుండగా...ఎడ్‌సెట్, లాసెట్‌లను అక్టోబరు మొదటి వారంలో పూర్తి చేయనున్నారు. మిగిలిన అన్ని పరీక్షలు సెప్టెంబరులోనే జరపనున్నారు. గత ఏడాది కంటే ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, పీఈసెట్‌కు దరఖాస్తులు పెరిగాయని విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.ఇంటికే బతుకమ్మ చీరలు!
అక్టోబరు మొదటి వారం నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చీరలను నేరకుగా మహిళల ఇళ్లకే తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఏటా రేషన్‌షాపుల ద్వారా చీరలను అందజేయగా.. ఈ సారి కరోనా దృష్ట్యా నేరుగా ఇళ్లకే పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. త్వరలో సీఎం అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి?
దశాబ్దాల చరిత్రగల కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. యువనేత రాహుల్ గాంధీకే తిరిగి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పార్టీలోని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. సోనియాగాంధీయే ఆ పదవిలో కొనసాగాలని కొందరు నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న సీడబ్ల్యూసీ భేటీకి ప్రాధాన్యం సంతరించకుంది. పార్టీ అధిష్ఠానం ఏదైనా అనూహ్య నిర్ణయం ప్రకటిస్తుందేమో అనే ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.