తెలంగాణ

telangana

ETV Bharat / state

Latest Telangana News టాప్​న్యూస్​ 11AM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

etvbharat telangana top news
టాప్​న్యూస్​ 11AM

By

Published : Aug 18, 2022, 11:00 AM IST

  • దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు

INDIA COVID CASES భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. తాజాగా 12,608 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 16,251 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.56 శాతానికి చేరుకుంది.

  • తల్లిని బతికించుకునేందుకు తోపుడు బండిపై ఆస్పత్రికి

సమయానికి అంబులెన్సు రాలేదు. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని తోపుడుబండిపై ఆస్పత్రికి తరలించాడో కొడుకు. కానీ ఆమె అప్పటికే మరణించింది. అదే తోపుడుబండిపై ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చాడు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

  • తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో ఆరుగురి అరెస్టు

Tammineni krishnaiah murder update మాజీ మంత్రి తుమ్మల ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. కృష్ణయ్య హత్యకు ఆయుధాలు సమకూర్చిన వారిని అదుపులోకి తీసుకుని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

  • అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోన్న కాంగ్రెస్

మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్‌ సీనియర్లు పట్టించుకోవడం లేదు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మానిక్కం ఠాగూర్‌ సమావేశానికి ముఖం చాటేశారు. మునుగోడు వ్యూహరచన కమిటీ కన్వీనర్‌ మధుయాష్కీనే భేటీకి రాలేదు. కరోనాతో హోం క్వారంటైన్‌లో ఉన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమావేశానికి దూరమయ్యారు.

  • మునుగోడులో గెలుపే లక్ష్యంగా కమలనాథుల కసరత్తు

bjp meeting in munugodu మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా... కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. 21న జరిగే భారీ బహిరంగసభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిధిగా హాజరవుతుండడంతో.. పెద్దఎత్తున జనసమీకరణకు కషాయదళం ప్రణాళికలు రచిస్తోంది. రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డితో పాటు.. నియోజకవర్గంలోని పలువురు కీలక నేతలు.. అమిత్‌షా సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు.

  • భార్యపై అనుమానంతో పిల్లల్ని చంపిన తండ్రి

Father Killed His Kids in Nagarkurnool నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఇద్దరు పిల్లల గొంతు కోసి తండ్రే హత్యచేసిన ఘటనలో విషాదకర కోణంలో వెలుగులోకి వచ్చింది. పిల్లలు తనకు పుట్టలేదన్న అనుమానంతోనే గొంతు కోసినట్లు చంపినట్లు స్థానికులు చెబుతున్నారు.

  • వీడ్కోలు రోజు అన్నీ చెబుతానన్న సీజేఐ

CJI Ramana Retirement తాను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, వాటన్నింటినీ వీడ్కోలు ప్రసంగంలో చెబుతానన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ. మరోవైపు మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ప్రవాస భారతీయులకూ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

  • కుటుంబ పోషణ భారమైందని భారత మాజీ క్రికెటర్ ఆవేదన​

Vinod Kambli Financial కుటుంబాన్ని పోషించడానికి తాను కష్టాలు పడుతున్న సంగతి దిగ్గజ ఆటగాడు, తన చిన్ననాటి స్నేహితుడు సచిన్‌ తెందుల్కర్‌కు తెలుసని అన్నాడు టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వినోద్‌ కాంబ్లి. సచిన్‌ గొప్ప స్నేహితుడని.. అతని నుంచి ఏమీ ఆశించట్లేదని తెలిపాడు.

  • సౌందర్యలహరిపై మాట్లాడిన దర్శకేంద్రుడు

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న సినిమా వాంటెడ్​ పండుగాడ్​. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆయన ఈనాడు సినిమాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలు మీకోసం

  • బాలయ్య అనిల్​రావిపూడి సినిమా బడ్జెట్​ అన్ని కోట్లా

Balakrishna Anilravipudi movie Budget నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత అనిల్​రావిపూడితో ఎన్​బీకే 108 మూవీ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు.

ABOUT THE AUTHOR

...view details